Advertisement

వైసీపీ గెలిస్తే మంత్రులు వీళ్లేనట.. జాబితా..!!

Thu 16th May 2024 10:09 AM
ycp  వైసీపీ గెలిస్తే మంత్రులు వీళ్లేనట.. జాబితా..!!
If YCP wins, these are the ministers.. list..!! వైసీపీ గెలిస్తే మంత్రులు వీళ్లేనట.. జాబితా..!!
Advertisement

ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి..! ఎన్నికలు మొన్ననే అయ్యాయి. ఇంకా ఫలితాలు రాలేదు. పార్టీల భవిష్యత్తు ఈవీఎంలలో భద్రంగా దాగి ఉంది. ప్రజలు ఏ పార్టీని ఆదరించారు..? ఏ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టబోతున్నారు అనేది జూన్ - 04న తేలిపోనుంది.

ఎవరి గెలుపు ధీమాలో వారున్నారు. కచ్చితంగా గెలిచి తీరుతామని కూటమి పార్టీలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మాదే సుపరిపాలన కొనసాగిస్తామని వైసీపీ బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. ఐతే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఏ పార్టీ కూడా అంచనాలు తేలట్లేదు. గెలుపు అనేది మనకు ఎప్పుడో తేలిపోయింది. ఇక మిగిలిందల్లా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎన్ని ఎక్కువ రావచ్చు..? ఆ నంబర్ డబుల్ అవుతుందా..? లేకుంటే మ్యాజిక్ ఫిగర్ తర్వాత ఇంకో 20 నుంచి 30 వరకూ వస్తాయా అన్నది తేలట్లేదు.. కానీ అధికారం మాత్రం మనదే అనే ధీమా వైసీపీ నాయకులు గట్టిగానే చెప్పుకుంటున్నారు. 

ఇదీ సంగతి!

ఇవన్నీ.. అటుంచితే వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు కొందరు ఇంకో అడుగు ముందుకేసి ప్రమాణ స్వీకారానికి తేదీలు, ప్లేస్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇదివరకే వైఎస్ జగన్ చెప్పేసారు. ఇక కేబినెట్ మంత్రులు వీరే అంటూ ఒక జాబితాను కూడా వైసీపీయన్స్ హడావుడి చేస్తున్నారు. ధీమా ఉండొచ్చు.. అందులో ఎలాంటి తప్పు లేదు కానీ . మరీ ఇంతలా అంటే విచిత్రంగానే ఉంటుంది మరి.

ఇదిగో వీళ్ళే మంత్రులట..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ పెద్దలతో చర్చించిన తర్వాత మంత్రి మండలి కూర్పు జరిగింది. జగన్ లండన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక మరోసారి ముఖ్య నేతలతో భేటీ అయ్యి ఫైనల్ చేస్తారు అని ఒక సందేశం సోషల్ మీడియాలో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం రండి చూద్దాం..

బీసీలకు పెద్ద పీట..

1. Thammineni Seetharam

2. Viswasarayi Kalavathi

3. Botcha Satyanarayana

4. M. V. V. Satyanarayana

5. Karanam Dharmasri

6. Kurasala Kannababu

7. Ponnada Venkata Satish Kumar

8. Margani Bharath

9. Mudunuri Prasad Raju

10. Taneti Vanitha

11. Samineni Udaya Bhanu

12. Pinnelli Rama Krishna reddy 

13. Burra Madhusudan Yadav

14. Nallapareddy Prasanna Kumar Reddy

15. Balineni Srinivasa Reddy

16. Korumutla Srinivas

17. Talari Rangaiah

18. Silpa Chakrapani Reddy

19. Butta Renuka

20. Shaik Noori Fathima

21. Peddireddy Ramachandra Reddy

22. Vipparthi Venugopal Rao

23. Kona Raghupathi

24. Mekathoti Sucharita

25. K. S. Bharath

చూశారుగా ఇదంట.. ఇందులో ఏ మాత్రం నమ్మశక్యం అయ్యేలా ఉందో మీరే చెప్పండి. అదిగో మొదట్లో చెప్పాను కదా ఆలూ లేదు...అనేది కరెక్టుగా సెట్ అవుతుంది కదా.. ఇదన్న మాటా సంగతి.

If YCP wins, these are the ministers.. list..!!:

YCP 2024: These are the ministers.. list..!!

Tags:   YCP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement