Advertisement

జగన్ కి టెన్షన్ మొదలైందా?

Wed 08th May 2024 05:34 PM
jagan  జగన్ కి టెన్షన్ మొదలైందా?
Has tension started for Jagan? జగన్ కి టెన్షన్ మొదలైందా?
Advertisement

16 నెలలు జైలులో ఉండొచ్చిన జగన్ కి ఎవరు ఓటేస్తారులే అనుకుంటే.. ఏపీ ప్రజలు సింపతితో 2019 లో వైస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి సీఎం ని చేసారు. సీఎం అవ్వకముందు ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయిన జగన్ సీఎం అయ్యాక కోర్టుకి డుమ్మా కొట్టేవాడు. అయితే సీఎం గా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రం బాగు వదిలేసి.. తన ఓటు బ్యాంకు ని కాపాడుకునే ప్రయత్నం చేసాడు అనడంతో ఎలాంటి సందేహము లేదు.

పేదలకి, పెద్దవారికి పెన్షన్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఆడవాళ్ళకి 45 ఏళ్ళు దాటితే 18000 బ్యాంకు లో వెయ్యడం, అమ్మ ఒడి లాంటి పథకాలను అమలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని, ముఖ్యంగా రోడ్లు వెయ్యడం వదిలేసి , ప్రతిపక్షాన్ని ఎలా జైలులో పెట్టాలా  అని జగన్ ఆలోచించాడు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఎంతసేపు తన పథకాలకు డబ్బు వేశానా.. బటన్ నొక్కనా అనే ధోరణిలోనే ఉండిపోయాడు.

అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో కూటమితో జగన్ హోరా హోరి యుద్ధం చేస్తున్నాడు. ఒకవేళ తానూ గెలవకుండా కూటమి గెలిస్తే తన పరిస్థితి ఏమిటో అని జగన్ కి టెన్షన్ మొదలయ్యింది అనే టాక్ వినిపిస్తుంది. గత ఐదేళ్లుగా బీజేపీ తో దోస్తీ చేసి తాను అరెస్ట్ అవకుండా, తన అనుకున్నవాళ్ళని కేంద్ర నుంచి కాపాడుకుంటూ వస్తున్న జగన్ ఈసారి కూటమిలో అంటే బీజేపీ తో వైరం పెంచుకున్నాడు.

గెలిస్తే మళ్ళీ బీజేపీ కాళ్ళ వద్దకి వెళ్తాడు. అదే ఓడితే.. బీజేపీ తో పెట్టుకున్నందుకు మళ్ళీ జైలుకెళ్లాల్సి వస్తే.. ఇదే ఇప్పడు జగన్ ఆందోళనకి కారణమంటున్నారు. మరోపక్క ఎన్నికల సమరం మే 13 తో ముగియడంతో మే 15 లండన్ కి భార్యతో కలిసి వెళ్లేందుకు జగన్ రెడీ అయ్యి కోర్టు అనుమతి కోసం ట్రై చేస్తున్నాడు. మరి ఈసారి ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. 

Has tension started for Jagan?:

Jagan started getting tensed as to what would be his situation if the alliance wins

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement