Advertisement

పవన్ గొంతు చట్టసభల్లో వినిపించాలి - చిరు

Tue 07th May 2024 11:56 AM
chiranjeevi  పవన్ గొంతు చట్టసభల్లో వినిపించాలి - చిరు
Chiranjeevi steps in for Pawan Kalyan and Jana Sena పవన్ గొంతు చట్టసభల్లో వినిపించాలి - చిరు
Advertisement

పవన్‌ను ఎందుకు గెలిపించాలో చిరు మాటల్లో..!

అవును.. అనుకున్నట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగిపోయారు. పిఠాపురం వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తారని మొదట వార్తలొచ్చాయి కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయిన చిరు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. అసలు పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు..? పవన్‌ను ఎందుకు గెలిపించాలి..? పవన్‌ను గెలిపిస్తే ఏమవుతుంది..? అనే విషయాలన్నీ క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మెగాస్టార్ వివరించారు. ఇంకెందుకు ఆలస్యం తమ్ముడి  కోసం అన్నయ్య పంపిన ఆ సందేశమేంటో విందాం రండి..!

ఇలాంటోడే కావాల్సింది..!

కొణిదెల పవన్ కల్యాణ్.. అమ్మ కడుపులో ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. మంచి చేయాలి అనే విషయంలో మాత్రం ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కల్యాణ్‌ది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఏదైనా చేయాలని అనుకుంటారు కానీ కళ్యాణ్ మాత్రం తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుపెట్టడం.. సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి కాపాడే జవానులకు పెద్ద మొత్తం అందివ్వడం.. అలాగే మత్స్యకారులకు ఇలా ఎందరికి చేసిన సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి అయిష్టంగానే వచ్చాడు కానీ.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికి అయినా కొడుకు కష్టపడుతుంటే గుండె తరక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న తన తల్లికి  ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు.. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం.. వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది.. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నానని చిరు చెప్పారు.

జనమే జయం!

అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే వాళ్లతోనే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి.. జనం కోసం జనసైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకింతం చేసిన శక్తి సన్ పవన్. ప్రజల కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే.. చట్ట సభల్లో ఆ గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు.. కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా.. సైనికుడిగా అండగా నిలబడతాడు.. మీకోసం ఏమైనా సరే కలబడతాడు.. మీ కలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం.. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి అని ఓటర్లను చిరు అడిగారు. ఇక ఆలస్యమెందుకు అన్నయ్య చెప్పారుగా.. గ్లాస్ గుర్తుపై గుద్దేయండహే..!

Chiranjeevi steps in for Pawan Kalyan and Jana Sena:

Chiranjeevi Superb Words About Pawan Kalyan 

Tags:   CHIRANJEEVI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement