Advertisement

కొడాలి నాని ఔట్.. చిన్నీకే ఛాన్స్..!!

Sat 27th Apr 2024 12:30 PM
kodali nani  కొడాలి నాని ఔట్.. చిన్నీకే ఛాన్స్..!!
Kodali Nani out from election race కొడాలి నాని ఔట్.. చిన్నీకే ఛాన్స్..!!
Advertisement

గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ చెల్లదా..? ఇక ఆయన తమ్ముడు కొడాలి చిన్నీనే వైసీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే ఇదే జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంతకీ కొడాలి నానికి ఏమైంది..? ఇంతకీ నామినేషన్ లో ఉన్న తప్పేంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి. 

అసలేం జరిగింది నాని..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అఫిడవిట్లు తప్పులు ఉన్న అభ్యర్థుల లెక్కలు తీసే పనిలో ఎన్నికల కమిషన్ ఉంది. ఇప్పటికే ఎందరు ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేశారు..? ఓకే పేర్లతో ఉండే అభ్యర్థులు ఎవరు..? ఏ పార్టీకి ఎన్ని..? మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి అని లెక్కలు తీసింది ఎన్నికల కమిషన్. మరోవైపు తమ ప్రత్యర్థులు అఫిడవిట్లలో సరిగ్గా వివరాలు పొందుపరచని నేతల లెక్కలు తీయగా గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని లెక్క బయట పడింది. అఫిడవిట్ లో నాని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు టీడీపీ నేతలు పిర్యాదులు చేశారు. మున్సిపల్‌ ఆఫీససును క్యాంపు కార్యాలయంగా వాడుకున్నట్లు తెలుగు తమ్ముళ్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు తెలిపిన పత్రాలను కూడా ఇందుకు జత చేయడం జరిగింది. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో చెప్పడం గమనార్హం. ఐతే ఈ పిర్యాదు నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

నాని ఔట్ చిన్ని ఇన్..!!

ఇలా ఏదో జరుగుతుంది అని తెలిసిందో ఏమో కానీ కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ  నాని నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తొసిపుచ్చితే.. కొడాలి చిన్నినీ అభ్యర్థిగా ఖరారు అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే నాని అభ్యర్థిగా తప్పుకోవడం అంటే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని తెలిసింది. ఐతే ఇదేం పెద్ద విషయం కాదని ఏదైనా మర్పులు, చేర్పులు ఉన్నా.. తప్పులు ఉన్న రిటర్నింగ్ అధికారికి వివరణ ఇస్తే సరిపోతుందని దీనికి ఇంత రాద్దాంతం అక్కర్లేదని నాని అనుచరులు, కొడాలి వర్గం చెబుతోంది. మరి ఫైనల్ గా నాని ఉంటాడా ఔట్ అవుతారా..? చిన్నీనే అభ్యర్థి అయ్యే ఛాన్స్ ఉందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఐతే ఇలాంటివి ఇప్పటివరకూ చాలానే ఏపీ ఎన్నికల్లో తేలాయి.

Kodali Nani out from election race:

Doubts on Kodali Nani Nomination

Tags:   KODALI NANI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement