Advertisement

టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ టాక్

Fri 29th Mar 2024 10:44 AM
tillu square  టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ టాక్
Tillu Square Premiers Talk టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ టాక్
Advertisement

సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోకి వచ్చేసింది. పలుమార్లు విడుదల తేదీలు మార్చుకుంటూ ఫైనల్ గా మార్చ్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే టిల్లు తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చేస్తున్నాడనగానే అందరిలో విపరీతమైన ఆసక్తి, అంచనాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఆ అంచనాలను టిల్లు స్క్వేర్ అందుకుందో, లేదో.. ఇప్పటికే పూర్తయిన టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ చూసి ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ఇస్తున్న స్పందన చూసి తెలుసుకుందాం.. 

హీరో సిద్దు జొన్నలగడ్డ తనదైన యాక్టింగ్, డ్యాన్సింగ్‌తో మెప్పిస్తాడు, టిల్లు స్క్వేర్ ఫస్టాఫ్ బాగుంది. పంచ్ డైలాగులు బాగా పేలాయి. టిల్లు స్టోరీ కాస్త స్లోగా ఉన్నా అసలైన ట్విస్ట్ రివీల్ అయినప్పుడు పంజుకుంది. టిల్లు స్క్వేర్ మూవీ ఫన్నీగా సాగే రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. సిద్దు జొన్నలగడ్డ ఎనర్జీ, అనుపమ పరమేశ్వరన్ అందం స్క్రీన్‌పై అద్భుతమే. సిద్దు వన్ లైనర్ డైలాగులు కట్టి పడేశాయి.. అంటూ కొందరు నెటిజెన్స్ ట్వీట్ వేశారు. ఈ మూవీ ఫ్యామిలీ కామెడీతో మొదలై, లిల్లీతో జోకులు, కొంత యాక్షన్, కొన్ని ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

టిల్లు స్క్వేర్ చాల స్లోగా ఉండడంసి సినిమాకి మెయిన్ మైనస్. కానీ సిద్దు వన్ మ్యాన్ షో చేశాడు అని చెప్పొచ్చు అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు. సిద్దు బాయ్ కోసం అయితే మళ్లీ మళ్లీ చూడండి, టిల్లు స్క్వేర్ కి నా రేటింగ్ 3/5 అంటూ మరో నెటిజెన్ స్పందించాడు. అయితే కొందరు టిల్లు స్క్వేర్ మూవీ ఏవరేజ్‌గా ఉంది. కామెడీ చాలా వరకూ వర్కౌట్ కాలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చుకుంటే బెటర్ స్టోరీనే కానీ.. కామెడీ సన్నివేశాలను చాలా బలవంతంగా రాసుకున్నట్లు అనిపించింది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Tillu Square Premiers Talk:

Tillu Square Social Media Talk

Tags:   TILLU SQUARE
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement