Advertisement

ఓ సాథియా రివ్యూ

Fri 07th Jul 2023 06:48 PM
o saathiya movie review  ఓ సాథియా రివ్యూ
O Saathiya Movie Review ఓ సాథియా రివ్యూ
Advertisement

ఓ సాథియా రివ్యూ 

బ్యానర్‌: తన్విక–జస్విక క్రియేషన్స్‌

నటీనటులు: ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు

మాటలు: ఈశ్వర్‌ చైతన్య

సంగీతం: విన్నూ వినోద్‌

కెమెరా: ఈజె.వేణు

పాటలు: భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల

నిర్మాతలు: సుభాశ్‌ కట్టా, చందన కట్టా

దర్శకత్వం: దివ్యభావన

కథ: 

వైజాగ్‌లో బి.టెక్‌ చదువుకుంటూ హాయిగా టైమ్‌పాస్‌ చేసే అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా)  కీర్తి (మిస్తీ చక్రవర్తి) మొదటి చూపులోనే మొదట చూపుతోనే ప్రేమలో పడతాడు. అర్జున్‌ అంటే పడని ఇంకా కొంతమంది కూడా కీర్తి  ప్రేమలో పడతారు. వాళ్లంతా కీర్తి నాదంటే నాదంటూ కొట్టుకుంటుంటారు. ఇద్దరితో విసిగిపోయిన హీరోయిన్‌ వీళ్లని ఎలా తప్పించుకుని తిరగాలా అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు కీర్తికి అర్జున్‌ ఓ సలహా ఇస్తాడు. వాడు నిన్ను ఏడిపించకుండా ఉండాలంటే మనిద్దరం ప్రేమలో ఉన్నాం అని ఉత్తిగా చెప్పేసేయ్‌.  ప్రాబ్లం సాల్వ్‌ అని అనటంతో నిజమే కదా! అనుకుని సరే అంటుంది కీర్తి. ఫ్రెండ్లిగా మూవీ అవుతున్న కీర్తికి ఒక మంచిరోజు చూసి ప్రపోజ్‌ చేద్దాం అనుకుని ఫోన్‌ చేస్తాడు అర్జున్‌. కానీ కీర్తి ఫోన్‌ స్విఛాఫ్‌ అని వస్తుంది. అప్పటినుండి పిచ్చోడిలా కీర్తి కోసం తిరుగుతుంటాడు అర్జున్‌. అలా మిస్‌ అయిన కీర్తి ఎక్కడికి వెళ్లిపోయింది? అసలు ఏం జరిగింది? వీళ్లిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా?  సడెన్‌గా కీర్తి ఎందుకు మిస్‌ అయ్యింది? అనేది మిగతా కథ. 

ఎఫర్ట్స్:

చిన్న ప్రేమ కథను ఎంత క్యూట్‌గా తీయెచ్చో తన మొదటి సినిమాతోనే ప్రూవ్‌ చేసుకున్నారు దర్శకురాలు దివ్యభావన. ఏ సినిమా దర్శకునికైనా మొదటిసినిమా ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అటువంటి దర్శకురాలికి నిర్మాతల రూపంలో గట్టిగా సపోర్ట్‌ లభించటంతో తననుకున్న కథను చక్కగా తెరకెక్కించాను అని దివ్య పలు సందర్భాల్లో చెప్పటం మనం చూశాం. అలాగే సున్నితమైన ప్రేమకథను చెప్పాలంటే కథతో పాటు కథనం చాలా ఇంపార్టెంట్‌. ఈ విషయంలో దర్శకురాలు తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారనే చెప్పాలి. 

ఇకపోతే సినిమాలో పాటలు బావున్నాయి. బ్రేకప్‌సాంగ్‌లో హీరో డాన్స్‌లు చక్కగా కుదిరాయి. కెమెరామెన్‌ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే ఎమోషనల్‌ సీన్స్, డైలాగ్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అది ఓ సాథియా సినిమాలో అణువణువునా కనిపిస్తుంది. 

సినిమా బలాబలాలు:

సింపుల్‌ కథ, కథనం

కెమెరా వర్క్, పాటలు

నటీనటుల పనితీరు

క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌

నిర్మాణ విలువలు

మైనస్‌లు:

ఫస్టాఫ్‌ కొంచెం స్లోగా ఉండటం

పేరున్న నటులు లేకపోవడం

పంచ్ లైన్: ఓ సాథియా డీసెంట్‌ లవ్‌స్టోరీ 

రేటింగ్‌: 2.75/5

O Saathiya Movie Review:

O Saathiya Movie Telugu Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement