Advertisement

సినీజోష్ రివ్యూ : భోళా శంకర్

Fri 11th Aug 2023 01:38 PM
bholaa shankar  సినీజోష్ రివ్యూ : భోళా శంకర్
Cinejosh Review: Bholaa Shankar సినీజోష్ రివ్యూ : భోళా శంకర్
Advertisement

సినీజోష్ రివ్యూ : భోళా శంకర్

బ్యానర్: AK ఎంటర్టైన్మెంట్ 

నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రఘు బాబు, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, తులసి, బ్రహ్మాజీ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా తదితరులు

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

డైలాగ్స్ : మామిడాల తిరుపతి

సినిమాటోగ్రఫీ : డడ్లీ 

మ్యూజిక్ : మహతి స్వరసాగర్

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం : మెహర్ రమేష్

రిలీజ్ డేట్: 11-08-2023

రాజకీయాలకి స్వస్తి చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది, వాల్తేర్ వీరయ్య మరింత ఊపునిచ్చింది. కానీ మధ్యలో మాత్రం సైరా, ఆచార్య చేదు అనుభవాన్ని చవి చూపించాయి. గాడ్ ఫాదర్ పర్లేదనిపించే ఫలితాన్ని అందించింది. ఈ క్రమంలో తనని ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉన్న మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చారు చిరంజీవి. కానీ అన్ని ఏళ్లుగా ఆయనతో ట్రావెల్ చేసినా సొంత కథ రాసుకోలేక ఆరవ కథని అరువు తెచ్చుకున్నారు మెహర్ రమేష్. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయ్యి కేవలం అజిత్ చరిష్మా తో అంతంత మాత్రంగా ఆడిన వేదాళం సినిమా నేడు తెలుగులో భోళా శంకర్ అనే అవతారమెత్తింది. నేడు థియేటర్స్ లోకి దిగింది. చిరంజీవి సినిమాల్లోకెల్లా లోయెస్ట్ బజ్ తో బరిలోకి దిగిన భోళా శంకర్ లో క్యాస్టింగ్ కి లోటు లేదు, కమర్షియల్ ఎలిమెంట్స్ కి కొదవ లేదు. మరి అంత ప్యాక్డ్ గా ముస్తాభై ముందుకొచ్చిన ఈ సినిమా సంగతేంటో.. సమీక్షలో చూద్దాం. 

భోళా శంకర్ స్టోరీ రివ్యూ:

చెల్లెలు మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ని కలకత్తాలో ఆర్ట్స్ కాలేజ్ లో చేర్చేందుకు శంకర్ (చిరంజీవి) హైదరాబాద్ నుండి కలకత్తా షిఫ్ట్ అవుతాడు. చెల్లెలిని కాలేజ్ లో జాయిన్ చేసి కలకత్తాలో క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరతాడు. మహాలక్ష్మిని చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు శ్రీకర్(సుశాంత్). మహాలక్ష్మి పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే కలకత్తాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అనుమానితుల ఫోటోలను ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చి.. వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వమని పోలీసులు చెబుతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో కొంత మంది అమ్మాయిలను పోలీసులు రక్షిస్తారు. మహిళల అక్రమ రవాణా చేసే అలెక్స్ (తరుణ్ అరోరా) మనుషులకు పోలీస్ లకి శంకర్ సమాచారం ఇచ్చాడని తెలుసుకుని శంకర్ ని ఆయన చెల్లి మహాలక్ష్మిని టార్గెట్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో భోళా భాయ్ అని అందరూ పిలిచే వ్యక్తి, కలకత్తాలో శంకర్ అవతారం ఎందుకు ఎత్తాడు అనేది భోళా శంకర్ పూర్తి కథ. 

భోళా శంకర్ ఎఫర్ట్స్:

కామెడీ, డ్యాన్స్, యాక్షన్, రొమాన్స్, యాక్టింగ్.. చిరు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా అభిమానులు ఇప్పటికి పండగ చేసుకుంటారు. అటువంటి యాక్టర్ కూడా మెహర్ కథ ముందు తేలిపోయారంటే భోళా శంకర్ లో సీన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తరహాలో చిరు చేసిన ఇమిటేషన్ అభిమానులను మెప్పించవచ్చు. ఖుషి సాంగ్, సీన్ స్పూఫ్ వచ్చినప్పుడు థియేటర్లలో అరుపులు వినిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవిని చూపించిన తీరు బావుంది. రొటీన్ యాక్షన్ సీన్లు అయినా సరే.. హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంజీవి మరోసారి అనుభవం చూపించారు. కీర్తీ సురేష్ సిస్టర్ పాత్రకు సాంప్రదాయకంగా న్యాయం చేశారు. తమన్నా గ్లామర్ పాటలకి  పరిమితమైంది. విలన్ రోల్ తరుణ్ అరోరా రొటీన్ యాక్టింగ్ తప్ప కొత్తదనం కనిపించలేదు. మురళీ శర్మ, రఘుబాబు, బ్రహ్మాజీ.ఇలా అందరివీ రొటీన్ రోల్స్. వెన్నెల కిశోర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా తెరపై కమెడియన్లు చాలా మంది కనిపించారు. ఒక్కరికీ నవ్వించే అవకాశం లభించలేదు. యాంకర్స్ శ్రీముఖి, రష్మీ చిరంజీవి సరసన సరదాగా కనిపించడానికి ప్రయత్నం చేసారే తప్ప సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు. 

సాంకేతికంగా.. ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా ఫెయిల్ అయిన టెక్నీషియన్ అంటే ముందుగా వినిపిస్తోంది, గట్టిగా కనిపిస్తోంది మహతి స్వరసాగర్ పేరే. మెగాస్టార్ స్థాయికి సరిపడే పాటలు అందించకపోగా.. చివరికి BGM విషయంలో కూడా పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సందర్భంలో ఈ సినిమాకి సంబంధించి అభినందనలు అందుకునే వ్యక్తి ఒకే ఒక్క కెమెరా మ్యాన్ డడ్లీ, చిరంజీవిని ఈ ఏజ్ లో కూడా చాలా అందంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. తనకి సాధ్యమైనంతలో సినిమాని చక్కగా తెరపైకి తెచ్చారు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తనకందిన సూచన మేరకే.. పని చేసారు. ఫైట్ మాస్టర్స్ చిరంజీవి వంటి సీనియర్ తో చేయగలిగిందంతా చేసారు. నిర్మాత అనిల్ సుంకర అందివచ్చిన అవకాశాన్ని తీసుకున్నారు, చిరంజీవికి తగ్గ స్థాయిలోనే ప్రాజెక్ట్ చేసుకున్నారు. 

ఇక దర్శకుడు మెహర్ రమేష్ విషయానికొస్తే.. ఓ దర్శకుడికి పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మరో అవకాశం రావడం అరుదు. అందులోను సాక్షాత్తు మెగాస్టార్ తో అంటే అది అదృష్టం. కానీ మెహర్ సర్ అక్కడ కూడా అరువు కథ మీదే ఆధారపడ్డారు. అరవం కథని డబ్బిచ్చి తెచ్చుకున్నారు. అది పోన్లే అని సరిపెట్టుకుందామంటే.. కనీసం ఆ అవుట్ డేటెడ్ కథకు సరైన రంగులు, హంగులు అద్దలేకపోయాయరు. సాలిడ్ స్క్రీన్ ప్లే ని దిద్దలేకపోయారు. కేవలం చిరంజీవి ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టిన మెహర్ మిగతా సినిమాని గాలికొదిలేశారు. మీడియా మొత్తానికి ఇలా దొరికిపోయారు. 

భోళా శంకర్ ఎనాలసిస్:

ఒకప్పటి మెగాస్టార్ కాదు చిరంజీవి. ఒకప్పటి అభిమానుల హడావిడేమీ లేదు ఇప్పుడొస్తున్న చిరంజీవి సినిమాలకి. ఎంతో బాధ్యతగా సినిమాలు చెయ్యాల్సిన స్థితిలో, స్థాయిలో చిరంజీవి లాంటి వ్యక్తి పేరడీలకి , కామెడీలకి ప్రయత్నిస్తుంటే.. ప్రేక్షకులే కాదు ఆయన అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. తెరపైన స్టార్ క్యాస్టింగ్ ఉన్నంత మాత్రాన పనవ్వదు. తెరనిండా కమెడియన్లు ఉన్నంత మాత్రాన కామెడీ పండదు. ఈ జనరేషన్ తో పోటీ పడాలంటే ఇన్నోవేటివ్ గా ఉండాల్సిందే. ఈ విషయంలో రియలైజ్ అవ్వాల్సిందే. స్వయంగా చిరంజీవి అభిమానులే ఇది భోళా శంకర్ కాదు.. గోలా శంకర్ అని గగ్గోలు పెట్టే స్థాయిలో ఇలాంటి అవుట్ ఫుట్ వచ్చిందంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దాయన చిరంజీవి గారు అప్రమత్తమవ్వాల్సిందే!

పంచ్ లైన్: భోళా శంకర్ - గోలా శంకర్ 

రేటింగ్: 2/5

Cinejosh Review: Bholaa Shankar:

Bholaa Shankar Telugu Movie Review

Tags:   BHOLAA SHANKAR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement