Advertisement

సినీజోష్ రివ్యూ : హిడింబ

Thu 20th Jul 2023 03:33 PM
hidimba  సినీజోష్ రివ్యూ : హిడింబ
Cinejosh Review: Hidimba సినీజోష్ రివ్యూ : హిడింబ
Advertisement

సినీజోష్ రివ్యూ : హిడింబ 

నటీనటులు : అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ తదితరులు

డైలాగ్స్ : కళ్యాణ్ చక్రవర్తి 

సినిమాటోగ్రఫీ : బి. రాజశేఖర్

మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బాడిస

నిర్మాత : గంగపట్నం శ్రీధర్

దర్శకత్వం : అనిల్ కన్నెగంటి

రిలీజ్ డేట్: 20-07-2023

అంతంత మాత్రం గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ కన్నెగంటి.. ఎంతోకొంతో గుర్తింపు సంపాదించుకున్న హీరో అశ్విన్ బాబు జతకట్టారు. ఓ మంచి సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించారు. కొత్త కథనే ఎంచుకున్నారు. భిన్నమైన నేపధ్యమే కుదుర్చుకున్నారు. హిడింబ అనే టైటిల్ తో ఒక అన్ ఎక్స్పెక్టేడ్ థ్రిల్లర్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ ఇంటెన్సిటీ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంతవరకు ఇంప్రెస్స్ చేసింది., అనేది సమీక్షలో చూద్దాం.

హిడింబ స్టోరీ రివ్యూ: 

హైదరాబాద్ మహానగరంలో వరసగా అమ్మాయిలు అదృశ్యమవడం కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిల కిడ్నాప్ విషయంలో స్వయంగా సీఎం (శుభలేఖ సుధాకర్) కిడ్నాపర్ ని పట్టుకున్నామని ప్రెస్ మీట్ పెడతారు. వరసగా 16 మంది అమ్మాయిల కిడ్నాప్ పోలీస్ లకి సవాల్ గా మారుతుంది. ఈ కేసుని సాల్వ్ చెయ్యడానికి కేరళ ఐపీఎస్ అధికారి ఆద్యని(నందిత శ్వేతా) పిలిపిస్తారు. ఆద్యతో కలిసి అభయ్(అశ్విన్ బాబు) కి ఈ అమ్మాయిల కిడ్నాప్ కేసుని సాల్వ్ చెయ్యమని ఈకేసుని పై అధికారులు అప్పగిస్తారు. ఆద్య-అభయ్ లు ఈ కేసుని ఎలా సాల్వ్ చేసారు. ఈ కథలో కీలకమైన కాలాబండా కథ ఏమిటి.. కేరళ అమ్మాయిల మిస్సింగ్ కేసుకి, హైదరాబాద్ లో మొదలైన అమ్మాయిల మిస్సింగ్ కేసుకి లింక్ ఏమిటి.. నరమాంస భక్షక గిరిజన జాతి హిడింబాలకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి అనేది హిడింబ ఫుల్ కథ.

ఎఫర్ట్స్ :

అశ్విన్ బాబు అభయ్ కేరెక్టర్ లో సింపుల్ గానే కనిపించినా.. యాక్షన్ సీక్వెన్సుల్లో అశ్విన్ బాబు పెరఫార్మెన్స్ హైలెట్ అయ్యింది. కాలాబండా ఫైట్ గానీ, కేరళలో తీసిన ఫైట్ లో అశ్విన్ బాబు బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉంది.. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పెరఫార్మెన్స్ బావుంది. ఐపీఎస్ అధికారిగా ఆద్య పాత్రలో నందితా శ్వేతా డ్రస్సింగ్ స్టైల్, యాక్టింగ్ బావున్నాయి. సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో, సీరియస్ లుక్స్ తో కనిపించింది. మకరంద్ దేశ్‌పాండే బదులు మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేం. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల ఇలా మిగతా నటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస ఇచ్చిన ట్యూన్స్ కన్నా నేపధ్య సంగీతానికి థియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది. నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ సీన్లను ఎలివేట్ చేశాయి.. బి. రాజశేఖర్ కెమెరా పని తనం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. యాక్షన్ సీక్వెన్స్, కేరళ అందాలు, ఫారెస్ట్ అందాలు ఇలా అన్నీ రిచ్ గా చూపించారు. ఎడిటింగ్ లోపాలు ఎక్కువగా కనిపించాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

దర్శకుడు అనిల్ కన్నెగంటి.. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కథని రాసుకున్నారు, యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేశారు. ఈ ఫైట్స్ లో హీరో అశ్విన్ కూడా బాగా చేసాడు. కానీ హీరో కేరెక్టర్ ని పవర్ ఫుల్ గా ప్రేక్షకులు నమ్మేలా చూపించలేకపోయారు. ఇలాంటి సస్పెన్స్ కథల్లో లవ్ ట్రాక్ ఉన్నా.. అది కథలో మిళితమయేలా రాసుకున్నా.. దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డారు. క్రైమ్ థ్రిల్లర్ కథలో యాక్షన్ సీన్లు బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. థ్రిల్లింగ్ సీన్లను బాగా రాశారు. ఈ తరహా సినిమాలకు లాజిక్కులు చాలా ముఖ్యం. దర్శకుడు ఆ లాజిక్కులను గాలికి వదిలేశారు. కొన్ని సీన్స్ ని మధ్యలోనే వదిలేసారు. స్టార్టింగులో ఆర్గాన్ ట్రేడింగ్ అంటారు. తర్వాత ఆ ఊసు ఉండదు. దాన్ని గాలికి వదిలేశారు. సిటీ వదిలి వెళ్ళకూడదని ఆద్యతో డీజీపీ చెబుతారు. ఆవిడ కేరళ వెళ్లి వస్తుంది. స్క్రీన్ ప్లే, రైటింగ్ పరంగా దర్శకుడు చాలా స్వేచ్ఛ తీసుకుని సినిమా చేశారు. 

ఎనాలసిస్: 

హిడింబ ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి కకలిగించిన మేకర్స్, ప్రీమియర్స్ అంటూ ఆ ఆసక్తిని రెట్టింపు చేసారు. అదే ఆసక్తితో థియేటర్స్ కి జనాలు రప్పించడంలో ఎంతోకొంత సక్సెస్ అయ్యారు. హిడింబ కథ, కథాంశం కొత్తగా ఉన్నాయి. అయితే.. ఆ కథను చెప్పిన తీరు మాత్రం రెగ్యులర్ రొటీన్ సినిమాలని తలపిస్తుంది.. సినిమా ఫస్టాఫ్ అంతా నార్మల్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఉంటుంది. దానిలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కొంచెం ఆసక్తి కలిగించింది. హిడింబలో కథంతా ద్వితీయార్థంలో ఉంది. మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఉంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ కథను ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. అశ్విన్ బాబు పడిన కష్టం తెరపై తెలుస్తుంది. పార్టులు పార్టులుగా బావుంటుంది. కానీ, ఓ కథగా, సినిమాగా చూసినప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. 

పంచ్ లైన్:  హిడింబ - హింసించింది

రేటింగ్: 2.5/5

Cinejosh Review: Hidimba :

Hidimba Telugu Movie Review

Tags:   HIDIMBA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement